May 12, 2021

Special Episode 09 - My Feeling About Mother - అమ్మ గురించి నా మాటల్లో ఎంతో కొంత చెప్పే ప్రయత్నం !!!


Special Episode 10 - My Feeling About Mother - అమ్మ గురించి నా మాటల్లో ఎంతో కొంత చెప్పే ప్రయత్నం !!!

 ఛాయా చిత్రం పుస్తకం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


భగవంతుడు ప్రతీ చోట తాను ఉండలేనని అమ్మని సృష్టించాడు అని కొందరు అంటారు 

మరికొందరు ఆ అమ్మే భగవంతుణ్ణి కన్నది అని రాశారు. ఇంకొందరు అమ్మ లేక పోతే ఇల్లంత వెల వెల బోతుంది అంటారు 

ఏది ఏమైనా అమ్మ ఒక అనంతమైన స్వచ్ఛమైన ప్రేమకు స్వరూపం 

మనకి కాలికి ముల్లు గుచ్చుకుంది అంటే తన కళ్ళల్లో పొంగే గోదారి వరాధల్ని గుండెల్లో ఉబికి వచ్చే బాధని ఎవరు ఆపగలరు ?

తొమ్మిది నెలలు మోసిన అమ్మ, మరో జన్మ నెత్తిన అమ్మ

ఆమె, ఒక అమ్మాయి నుండి ఒకరికి ఇల్లాలై చివరికి తన సంతానానికి తల్లిగా మరో వంశాన్ని మోస్తూ తాను పుట్టిన వంశాన్ని కట్టుకున్న వాడికోసం వదిలి మెట్టినింట అడుగుపెడుతుంది 

 పొద్దున లేచిన దగ్గరినుండి మనకు ఏం కావాలో ఖచ్చితంగా ఎవరికైనా తెలుసు అంటే అది కేవలం అమ్మే మొదటగా 

అలాంటి అమ్మకి ఒకరోజును కేటాయించడం ఎంతవరకు తప్పు ఒప్పు పక్కనపెడితే మన హిందూ ధర్మం లో అమ్మకి దేవుడికంటే ముందుగా చెప్తూ మాతృదేవోభవ అనే ఆర్యోక్తి మనం గుర్తుపెట్టుకోవడం ఉత్తమం 

 పాశ్చాత్య దేశాల సంస్కృతిలో బాగమైన Mother’s day ని బాగానే ఆచరించే మనం ఎంతవరకు అమ్మని మిగతారోజుల్లో గౌరవిస్తున్నాం. నేను ఈ day’s celebrations కి అడ్డం కాదు కానీ అవి  చేసేముందు ఒక ఆత్మ పరిశీలన అంటే self analysis చేసుకోవాలని మనవి 

 ఇంకా ఈ సమాజం లో సీరియల్స్ ప్రభావం ఎంతో తీవ్రం తన తల్లికి మాత్రమే విలువుండలి అవతలి వాళ్ళ తల్లికి ఎలాంటి విలువ ఇవ్వని సమాజం లో ఉన్నాం మనం 

 

ఈ తీరు మీ ఆలోచన తీరు మారాలి, కడుపుకి బుక్కెడు బువ్వ పెట్టె అవ్వ నీ పనిమనిషి కాదు మనల్ని నడిపే ఆది శక్తి స్వరూపం 

 ఒక్కోసారి అనిపిస్తుంది మనం చిన్నపుడు ఎంత అల్లరి చేసిన సరదాగా తీసుకొనే అమ్మా ఆగ్రహ రూపం కోపంగా ఉండటం చూసి మీలో మనలో ఎంత మంది భయపడేలేదు చిన్నపుడు 

 అమ్మా కరుణించినంతసేపు ఆమె దయామయి, ఒక్కసారి కోపమొచ్చిందా మహా కాళీ గా మన దుంప తీరుస్తుంది 

 

భరిస్తుంది కదా అమ్మని భాధ పెట్టకండి అది ఎవరి అమ్మైనా అది అమ్మే, మరో బొమ్మ కాదు 

మమతల్ని పోగేసుకున్న అమ్మ, ప్రపంచంలో గొప్ప యోధులు ఎవరంటే నేను అమ్మే అంటా 

ఎందుకంటే నాకు తెలిసి ఎవరైనా ఒకసారే పుడతారు ఒకసారే ఛస్తారు 

కానీ అమ్మా సంతానం కోసం ఎన్నిసార్లు చచ్చి పుట్టిందో 

 

వీలైతే ప్రేమగా రెండు కబుర్లు చెప్పండి, ప్రేమిస్తున్నానని నోరారా చెప్పండి ప్రతీ రోజు అంతే కాని ఏదో ఒకరోజు పెట్టుకొని అదేదో బిజినెస్ విషయాలు డీల్ చేస్తున్నట్టు చేయకండి 

 

ఆమె ఒక వస్తువు కాదు మిమ్మల్ని ఇంతలా తీర్చిదిద్దిన మగువ.. 

 

థాంక్స్
Shiva Prasad Vangala
Motive Missiles
email us: team@motivemissiles.in
write to us: motivemissiles@gmail.com

Music Credit: www.audionautix.com


#Bangalore, #Chennai, #Noida, #Delhi, #Telugu, #Hyderabad, #Telangana, #AndhraPradesh, #Vijayawada, #Vishakapatnam, #Vizag, #Guntur, #Secunderabad, #India, #TeluguPeople, #USA, #Canada, #SaudiArabia, #UAE, #Dubai, #Singapore, #Australia, #NewZealand, #buzzsprout #canva #jiosaavn #gaana #amazonmusic #stitcher #apple #google #spotify